For the third time in a row, Hyderabad Regional Center was awarded the Best Regional Center at the national level
వరుసగా మూడో సారి హైదరాబాద్ రీజినల్ సెంటర్ కు జాతీయ స్థాయి లో బెస్ట్ రీజినల్ సెంటర్ అవార్డ్
సాక్షిత న్యూస్ కర్నూల్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ హైదరాబాద్ రీజినల్ సెంటర్ లో గత ఏడు సంవత్సరాలు గా జాయింట్ సెక్రటరీ గా మరియు గత మూడు సంవత్సరాలు గా సెక్రటరీ పనిచేయడం, చైర్మన్ అరచి శాస్త్రవేత్త డా.
సంజయ్ భరద్వాజ్ మరియు హైదరాబాద్ రీజినల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, సీనియర్ మెంబెర్స్, మాజీ అధ్యక్షుల సహకారం తో ఎన్నో సెమినార్లు కాన్ఫెరెన్సులు వర్క్ షాపులు కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం నిర్వహించడం ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. దేశంలో ని 42 రీజినల్ సెంటర్స్ తో పోటీ పడి వరుసగా మూడు సార్లు హైదరాబాద్ రీజనల్ సెంటర్ కు జాతీయ స్థాయిలో బెస్ట్ రీజినల్ సెంటర్ అవార్డ్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.
మూడో సారి ఈ అవార్డు ను కాన్పూర్ లో ఈ నెల డిసెంబర్ 27 నుండి 30 వ తేదీ వరకు జరుగుతున్న 75 వ జాతీయ కెమికల్ ఇంజినీరింగ్ కాంగ్రెస్, అంతర్జాతీయ కాన్ఫరెన్స్ చంకన్ -2022లో ఈ అవార్డును మరో సారి తీసుకోవడానికి రెండో సారి గాలి మోటర్ ఎక్కుతున్న సంబరం ఆనందాన్ని ఇస్తుంది. డా. సాదం ఐలయ్య, రీజనల్ సెక్రటరీ