వృద్ధులకు పెద్దదిక్కుగా సీఎం కేసీఆర్ – ఎమ్మెల్యే జిఎంఆర్
-బొల్లారంలో ఆసరా పెన్షన్లు పంపిణీ
సాక్షిత : బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లను పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాత కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా ప్రతినిధుల సమక్షంలో నూతనంగా మంజూరైన 246 ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వృద్ధులకు పెద్దదిక్కుగా మారి ఆసరా పెన్షన్లను అందిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాసా సీనియర్ నాయకులు,మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి , రాజేంద్ర కుమార్ (బొల్లారం మున్సిపల్ కమిషనర్), పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు వి.హనుమంత్ రెడ్డి , కౌన్సిలర్లు గోపాలమ్మ , రాధా , జయమ్మ , చంద్రయ్య , నాయకులు వి.యాదిరెడ్డి , వెంకటయ్య , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులకు పెద్దదిక్కుగా సీఎం కేసీఆర్ – ఎమ్మెల్యే జిఎంఆర్
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…