SAKSHITHA NEWS

తొమ్మిదేళ్లుగా మురికి కాలువ పూడిక తీయనందుకు మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు
*సాక్షిత వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో 9 సంవత్సరాల నుండి మురికి తో కాలువ నిండి పోయిందని పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి వార్డులోకి రోడ్డుపై కి వస్తున్నదని అదే వార్డు కాలనీవాసి ఇటుకూరి రంజిత్ కుమార్ శెట్టి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు .వెంటనే మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకొని పూడిక నిండిన కాలువను తీయించాలని కోరారు.కాలువ దగ్గర చెట్లు అలం విపరీతంగా పెరిగి ఉండడం వల్ల ఇళ్లలోకి విష సర్పాలు వస్తున్నాయి ని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు . దీంతో కాలనీ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు


SAKSHITHA NEWS