SAKSHITHA NEWS

10 శాతం రాయితీని ప్రకటించిన టిజిఎస్ఆర్టీసీ ..

సాక్షిత సికింద్రాబాద్:
శ్రావణమాసం సందర్భంగా టిజిఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీని ప్రవేశపెట్టడం జరిగిందని రాణిగంజ్ డిపో మేనేజర్ ఏ. శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు పర్యాటక ప్రాంతాలు సందర్శించుట తీర్థ యాత్రల వెళ్ళుటకు బస్సులు అద్దె ప్రాతిపదికన సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో రాజధాని బస్సులలో ప్రయాణించేందుకు బస్సు బుక్ చేసుకునే వారికి శ్రావణమాసంలో ప్రత్యేకమైన 10% రాయితీ (డిస్కౌంట్) ఎటువంటి డిపాజిట్ లేకుండా బస్సులను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు


SAKSHITHA NEWS