జగనన్న ఇంటి నిర్మాణాలపై దృష్టి సారించండి – కమిషనర్ అనుపమ అంజలి
సాక్షిత తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మిస్తున్న జగనన్న ఇళ్ళ నిర్మాణాలపై దృష్టి సారించి పూర్తి చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ఆదేశాలు జారీ చేసారు. చిందేపల్లి లే అవుట్ లోని నిర్మాణాలను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేస్తూ పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలతో బాటు ఇంటి నిర్మాణాలను ప్రభుత్వమే చేపట్టి నిర్మాణాలు సాగిస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని, ఆలస్యం కాకుండా సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయవల్సిన భాధ్యత మనదేనని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ తిరుపతి అర్భన్ నివాసితులకు చిందేపల్లిలో కేటాయించిన స్థలాల్లో ఇప్పటి వరకు 1760 ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో జరుగుతున్నాయన్నారు. కొన్ని నిర్మాణాలు బేస్ మెంట్ పూర్తి చేసుకున్నాయని, మరికొన్ని గోడలు పూర్తి అయ్యాయని, మరికొన్ని స్లాబ్ లెవల్లో పనులు పూర్తి అయినట్లు వివరించారు. చిందేపల్లి లే అవుట్ లో ఇంటి నిర్మాణ పనుల్లో నీటి కొరకు ఎలాంటి ఇబ్బంది రాకుడదనే ఉద్దేశంతో ఇప్పటికే 30 బోర్లను వేయడం జరిగిందన్నారు. ఇల్లు నిర్మించేందుకు అవసరమైన సిమెంట్, ఐరన్ కొరత లేకుండా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకెలుతున్నట్లు కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డిఈ గోమతి, హౌసింగ్ అధికారులు డిఈ మోహనరావు ,ఏఈ భారతి, అమ్నెటి సెక్రట్రీలు పాల్గొన్నారు.*
జగనన్న ఇంటి నిర్మాణాలపై దృష్టి సారించండి – కమిషనర్ అనుపమ అంజలి
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…