వనపర్తి రోడ్డు రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని స్టేషన్ మాస్టర్ కు వినతి………… సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జానంపేట రాములు
….
*సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లాలోని వనపర్తి రోడ్ మదనాపురం మండల కేంద్రంలో ఆత్మకూరు వెళ్లే దారిలో రైల్వే గేట్ ఉండడంతో వనపర్తి కొత్తకోట ల నుండి ఆత్మకూరు నారాయణపేట మక్తల్ దేవరకద్ర మన్యంకొండ కురుమూర్తి జూరాల కు వెళ్లే వాహనాలు టూ వీలర్ లపై వెళ్లి ప్రయాణికులు రైల్వే గేటు ను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ సమయంలో వందల సంఖ్యలో అటువైపు ఇటువైపు వాహనాలు ఆగిపోవడంతో అత్యవసరగా వెళ్లే ప్రయాణికులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదంలో ఉన్న వ్యక్తులను రోగులను తరలించే అంబులెన్స్ వాహనాలు సైతం రైలు వచ్చి వెళ్లి రైల్వే గేటు తీసేంతవరకు 30 నిమిషాల పాటు అక్కడే వెయిట్ చేయాల్సిందే ఈ క్రమంలో అంబులెన్స్ వాహనంలో ప్రమాదానికి గురైన వ్యక్తుల్ని రోగులు తరలిస్తున్న క్రమంలో మృత్యువాత పడే ప్రమాదం ఉందని అలాగే గతంలో ఈ గేటు వద్ద ట్రాక్టర్లు ఇతర వాహనాల రైళ్ల రాకపోకల సమయంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలుస్తోందని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఫ్లవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు కృషి చేయాలని సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ జానంపేట రాములు ఆధ్వర్యంలో మదనపురం రైల్వే స్టేషన్ మాస్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఇతర పార్టీ నాయకులు కే వెంకటేశ్వర్లు, వెంకటస్వామి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.