SAKSHITHA NEWS

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలోని రోడ్డుపై నిలిచిన వరద నీరుని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జిహెచ్ఎంసి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంతో తొలగించడం జరిగింది. ఈ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, రవీందర్, సుధాకర్ రెడ్డి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS