SAKSHITHA NEWS

ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి
అధికార పార్టీ ఫ్లెక్సీలకు ఫైన్ వేసి వెంటనే తొలగించాలని డిమాండ్
సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :
సిద్ధిపేట పట్టణంలో రోజు చెత్త బండి వస్తున్నా మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల అధికారులు ఓట్ల కోసమే చెత్త ఎరుదాం అంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారని చెత్తను ఏరడం కాదు ముందుగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి ప్రజలను కాపాడాలని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే జరిమానా విధిస్తామని చెప్పి ఫ్లెక్సీలు కట్టకుండా బ్యాన్ చేశారని అవి మాటలకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు.

అధికార పార్టీకి చెందిన నాయకుల ప్లెక్సీలు ఇష్టాను రీతిలో ఎక్కడపడితే అక్కడ కట్టారని దీనిపై మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రహదారులపై ఇష్టం వచ్చినట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ప్లాస్టిక్ వాడొద్దని దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు స్వయంగా చెబుతున్న ప్లాస్టిక్ ఉన్న ఫ్లెక్సీలను ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నారని దీనిపై అధికారులకు నాయకులకు కనిపించడం లేదా అని అన్నారు. ఇప్పటికైనా మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల స్పందించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి జరిమానాలు విధించి వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. వాటిని వెంటనే తొలగించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కార్యదర్శి గ్యాదర మధు. సిద్దిపేట పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS