SAKSHITHA NEWS

ఆడుదాం ఆంధ్రా ఏర్పాట్ల పై దృష్టి పెట్టండి.
*నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్
స్పందన లో ప్రజల నుండి వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని, ఈ నెల 26 న ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సావానికి అన్ని ఏర్పాట్లు పక్కగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. స్పందన లో వచ్చిన సమస్యల పరిష్కారం, ఆడుదాం ఆంధ్రా ఏర్పాట్లపై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పందన, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది వెంటనే పరిష్కరించాలని అన్నారు. పరిష్కారం కానీ సమస్యలను ఎందుకు కాలేదో వారికి తెలియజేయాలని అన్నారు.

అలాగే సచివాలయంలో వద్ద కూడా ప్రతి సోమవారం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ నెల 26నా ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సవానికి అన్ని ఏర్పాట్లు పక్కగా ఉండేలా చూడాలని అన్నారు. ఆయా క్రీడలకు సంబందించి టీం కు సరిపోయేలా క్రీడాకారులను ఎంపిక చేయాలని అన్నారు. అన్ని క్రీమైదానాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లను సరిచూసుకోవాలని అన్నారు. అన్ని కూడా ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, సెక్రెటరీ రాధిక, రెవెన్యూ ఆఫీసర్ కే.ఎల్.వర్మ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్, డి . ఈ.లు విజయకుమార్ రెడ్డి, రవీంద్రా రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, రాజు, శ్రావణి, మేనేజర్ చిట్టిబాబు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 20 at 4.08.48 PM

SAKSHITHA NEWS