SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో.. రాష్ట్రంలోనే తొలి గవర్నమెంట్ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు కానుంది.

ఇప్పటికే ఉన్న కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని ఇంజినీరింగ్‌ కళాశాలగా మారింది. ఈ మేరకు కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీని అప్‌గ్రెడేషన్‌ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు వెలువరించారు.

2024-2025 విద్యా సంవత్సరం నుంచే కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో తరగతులు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.

ఈ కొత్తగా ఏర్పాటు చేయనున్న గవర్నమెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో మొదట 3 బీటెక్‌ బ్రాంచీలు అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

బీటెక్‌ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ ఏఐ అండ్‌ ఎంఎల్‌. సీఎస్‌ఈ డేటా సైన్స్‌.. 3 కోర్సులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్లు ఈ కాలేజీలో ఏర్పాటు చేసింది..

Whatsapp Image 2024 01 23 At 12.28.59 Pm

SAKSHITHA NEWS