SAKSHITHA NEWS

మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం
సాక్షిత వనపర్తి
నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని యం.బి.బి. యస్ లో సీటు సాధించి ఈ విద్యా సంవత్సరం మెడిసిన్ చదువుతున్న వనపర్తికి చెందిన కృతిక కు స్థానిక హరిజనవాడ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సూర చంద్ర శేఖర్ ఆర్థిక సాయం అందజేశారు.
కృతిక తండ్రి ఆంజనేయులు ఆటో డ్రైవర్.కూతురు బాగా చదువుకోవాలని ప్రోత్సహించాడు.పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలలో,ఇంటర్మీడియట్ ఒక ప్రైవేట్ కళాశాలలో చదివిన కృతిక స్వశక్తితో కష్టపడి చదివి కరీంనగర్ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది.ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్ లలో తన మిత్రులకు తెలియజేసిన సూర చంద్ర శేఖర్ నార్వే దేశంలో ఉంటున్న ఆయన మిత్రుడు బాల వర్ధన్ రెడ్డి స్పందించి 20వేల రూపాయలు ఆ అమ్మాయికి అందజేయమని పంపాడు.

ఈ మధ్య సెలవులపై ఇంటికి వచ్చిన కృతికకు గురువారం తమ పాఠశాల విద్యార్థుల మధ్య ఆ డబ్బును అందజేశాడు.కృతిక పట్టుదల,కృషిని కార్యక్రమానికి హాజరైన పెద్దలు అభినందించారు.
ఈనాటి కార్యక్రమంలో ఎంఈఓ లు మద్దిలేటి, శ్రీనివాస్ గౌడ్,ప్రధానోపాధ్యాయులు గణేష్ కుమార్, సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్,ఉపాధ్యాయ సంఘ నాయకులు శ్రీనివాసరావు, హరిప్రసాద్,కవి జనజ్వాల,గంధం నాగరాజు, బైరోజు చంద్ర శేఖర్,బండారు శ్రీనివాస్,పాఠశాల ఉపాద్యాయులు రవి కుమార్,చిన్నయ్య,అరవింద్,విజయ భాస్కర్,రుక్మద్ధీన్,వరలక్ష్మి, రంగ నాయకమ్మ తదితరులు పాల్గొనీ అభినందించారు.


SAKSHITHA NEWS