SAKSHITHA NEWS

Finally, the decision of the Health and Welfare Department on the death of Transfer Ritvik

ఎట్టకేలకు ట్రాన్స్ఫర్
రిత్విక్ మృతిపై ఆరోగ్య, సంక్షేమ శాఖ నిర్ణయం
ట్రాన్స్ఫర్ చేయడం కాదు సస్పెండ్ చేయాలి
-రిత్విక్ తండ్రి చిటికెల సురేష్*


సాక్షిత ప్రతినిధి కొత్తూరు

మూడు నెలల రిత్విక్ మృతి పై అతని తండ్రి చిటికెల సురేష్ శుక్రవారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు.తన మూడు నెలల కుమారుడి మృతికి కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ సబ్ సెంటర్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం మల్లమ్మ నిర్లక్ష్యమే కారణమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వ్యాక్సిన్ వేసేటప్పుడు మల్లమ్మ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన వాపోయారు.తాము ఎంత చెప్పినా వినకుండా ఒక చేత్తో సెల్ఫోన్ మాట్లాడుతూ మరో చేత్తో వ్యాక్సిన్ ఇచ్చిందని అందువల్లే హెవీడోస్ వ్యాక్సిన్ వేసినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

తన కుమారునికి జరిగినట్లు మరెవరికి జరగకూడదు అంటే ఏఎన్ఎం మల్లమ్మను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆయన కోరగా ఎట్టకేలకు స్పందించి ఏఎన్ఎం మల్లమ్మను శేర్ లింగంపల్లి కి ట్రాన్స్ఫర్ చేసినట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

రిత్విక్ తండ్రి చిటికెల సురేష్ మాట్లాడుతూ.. మా మూడు నెలల బాలుని మృతికి కారణమైన ఏఎన్ఎం మల్లమ్మని ట్రాన్స్ఫర్ చేయటం కాదు సస్పెండ్ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని ఆవేదన వ్యక్తపరిచారు తండ్రి సురేష్.


SAKSHITHA NEWS