ఒంగోలు నగరం లోని కొత్త పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఒంగోలు RDO
ఈ రోజు 13..9..23 బుధవారం,ఒంగోలు లోని పోలింగ్ స్టేషన్లు పరిశీలన ఒంగోలు RDO విశ్వేశ్వరరావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలన చేయటం జరిగింది దాదాపుగా ఒంగోలు నియోజకవర్గం లో 20 పోలింగ్ స్టేషన్లు మారుస్తున్న నేపథ్యంలో ఈ రోజు సత్యనారాయణ పురం 49 డివిజన్ లో ని 59,60,61,62,63,64,పోలింగ్ బూతులు ఆంధ్ర హైస్కూల్ పాత, కొత్త బిల్డింగ్ లలోకి మార్పు, రెండు బూతులు 49 డివిజన్ సచివాలయం లోకి మార్పు చేసారు, అలానే 22 డివిజన్ పోలింగ్ బూత్ నెంబర్ 154 ను దక్షణం బజార్,కిచ్చయ్య బడి నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల 22 డివిజన్ సచివాలయం లోకి మార్పు చెయ్యటం జరిగింది, కేంద్రియ విద్యాలయం పోలింగ్ స్టేషన్ బూత్ ను వేరే రూంలో కి మార్చడం జరిగింది పోలింగ్ స్టేషన్లు ఓటర్లకు అనుకూలంగా ఉన్నది లేనిది నిర్దారణ చేసుకోవటం జరిగింది ఈ కార్యక్రమం లో ఒంగోలు DT రఫీ పొలిటికల్ పార్టీల ప్రతినిధులు వైసీపీ తరుపున దామరాజు క్రాంతికుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్, SK రసూల్,బీజేపీ బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం ఎన్నికల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు