ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేయాలని…….. తాసిల్దార్ కార్యాలయం ఎదుటసిపిఎం ధర్నా
రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని డిమాండ్…………..
పుట్ట ఆంజనేయులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
సాక్షిత వనపర్తి ఆగస్టు 29
రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయాలని
గురువారం సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ విజయ సింహా కు వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు, మేకల ఆంజనేయులు, ఏ. లక్ష్మి, సిపిఎం పట్టణ నాయకులు. పరమేశ్వారా చారి లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో రెండు లక్షల వరకు రైతులు తీసుకున్న అప్పులను మాఫీ చేస్తామని వాగ్దానం చేసిందని. వాగ్దానంలో భాగంగా ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్ చేశారని చెప్పారు .కానీ 50% రైతులకు మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయని, ఎలాంటి షరతులు లేకుండా బేసరత్తుగా 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అడిగిన ప్రతి రైతుకు కొత్తగా రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
రైతులు బ్యాంకుల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయే లా తిరుగుతున్న . తమ అప్పులు మాఫీ అయితావో లేదని రైతులు ఆందోళన పడుతున్నారని, బ్యాంకులు వ్యవసాయ అధికారులు సమన్వయంతో అప్పుల మాఫీ విషయంలో స్పష్టతనివ్వాలని. రేషన్ కార్డును పరిగణన లేకుండా అప్పు తీసుకున్న రైతులందరికీ రుణ విముక్తులను చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అప్పుల మాఫీ విషయంలో స్పష్టత లేదని, బేసరత్తుగా రైతులందరికీ అప్పులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు ఉమా కవిత నందిమల్ల రాములు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు