farmer రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలి
పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి
సాక్షిత సిద్దిపేట్ జిల్లా:
farmer సిద్దిపేట జిల్లా గజ్వేల్ గత ప్రభుత్వంలో రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన పలు రైతు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జగదేవపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన రైతు భరోసా,రైతు పథకాలపై రైతుల నుండి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ అయామలో రైతులకు ఎంతగానో ఉపయోగపడే పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా పథకాలు చేపట్టి అమలు చేయాలని కోరారు.రైతు భరోసా రైతు పథకాల పట్ల రైతుల అభిప్రాయాలను సేకరించి ఉన్నత స్థాయి అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు డిసిసిపి బ్యాంక్ మేనేజర్ నాగభూషణం పిఎసిఎస్ డైరెక్టర్లు వెంకట్నర్సు,యాదయ్య,శ్రీనివాస్, రైతులు కార్యాలయ సీఈఓ రాములు సిబ్బంది సత్యనారాయణ రెడ్డి సందీప్ రెడ్డి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app