SAKSHITHA NEWS

LRS ఉచితంగా చేస్తామని బూటకపు హామీ ఇచ్చి , ఇప్పుడు మాట తప్పి ప్రజల నుండి డబ్బులు వసూళ్లు కి తెరలేపిన కాంగ్రెస్ పార్టీ నిరంకుశ, ద్వంద వైఖరికి నిరసనగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయం లో మరియు శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ ,తహసీల్దార్ కార్యలయంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , హమీద్ పటేల్ , దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ సాయి బాబా , బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ,నాయకులు,కార్యకర్తలతో కలిసి జోనల్ కమిషన్ కి ,శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ ,తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఎల్ఆర్ఎస్ కి డబ్బులు వసూలు చేస్తుందని.. దీనికి నిరసనగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం,మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మెరకు జోనల్ కార్యలయం లో మరియు మండల తహసీల్దార్ కార్యలయంలో LRS ఫీజులు వసూలు చేయకుండా ఉచితంగా LRS చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగినది అని, బిఆర్ఎస్ పార్టీ ఎల్లపుడు ప్రజల పక్షాన పోరాడుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

గత ఎన్నికలలో బూటకపు హామిలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు పరచకుండా ప్రజలను మోసము చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎల్.ఆర్. ఎస్ ను ఉచితంగా అమలు చేస్తానని చెప్పి ప్రజలను మభ్య పెట్టింది.కాని అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టి ప్రజల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే అధికారంలోకి రాకముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం లోకి వచ్చిన తరువాత కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించాలంటూ గడువు విధిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించడానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కావున ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఎల్.ఆర్.ఎస్ ను ఉచితంగా అమలుచేసి మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లేనియెడల ప్రభుత్వ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ తీరును నిరసిస్తూ మరిన్ని ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సివస్తుందని ఈ సందర్భంగా తమరి ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము.పేద వర్గాల వారు గతం లో కొన్న ఇండ్లకు ఎల్.ఆర్. ఎస్ లేనందున కట్టుకున్న ఇండ్లపై ఎల్.ఆర్.ఎస్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు .

గతం లో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు చేసుకున్న వారికీ రెగ్యూలరైజేషన్ చేసే విషయాన్ని పరీక్షించకుండా దాని పైన ఎలాంటి నిర్ణయం  చెప్పకుండా ఇప్పుడు కొత్తగా ఎల్.ఆర్.ఎస్ పథకాన్ని ప్రవేశ పెట్టడం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయ మార్గం పెంచుకోవడమే  కనబడుతుంది.కావున గతం లో దరఖాస్తు చేసుకున్న ఎల్.ఆర్.ఎస్  పథకాన్ని పరీక్షిస్తూ కొత్తగా ఇప్పుడు ప్రవేశ పెట్టిన ఎల్.ఆర్.ఎస్ పథకం వారు ఇచ్చిన హామీల ప్రకారం ఉచితంగా మంజూరి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా పనిచేయాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాన్ని నడిపే నాయకుల పైన ప్రభుత్వంలో శాశ్వత భాగస్వాములైన ప్రభుత్వాధికారుల పైన ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోని ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా గతంలో ఎన్నికల ముందు అనేకసార్లు ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉచితంగా ఎలాంటి ఫీజులు లేకుండా చేపడతామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం రాగానే ప్రజల వద్ద నుంచి ఫీజులు తీసుకోకుండా వారు దరఖాస్తు చేసుకున్న ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని హామీలు ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు ప్రజల భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎల్ ఆర్ ఎస్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్న 25 లక్షల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, వారిపై పడే సుమారు 20 వేల కోట్ల రూపాయల భారాన్ని తప్పించేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అప్పటిదాకా ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుదారులకు ఫోన్లు చేయడం వంటి పద్ధతుల ద్వారా ఫీజులు కట్టమని ప్రభుత్వాధికారులు ఒత్తిడి చేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాము. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రజల తరఫున వస్తున్న డిమాండ్ ను ప్రభుత్వానికి తెలపాలని కోరుతున్నాము అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళ సోదరీమణులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు ,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


SAKSHITHA NEWS