శ్రేష్టమైన మిషన్ భగీరథ మంచినీటినే త్రాగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్””మీతో నేను” కార్యక్రమంలో భాగంగా బంట్వారం మండల కేంద్రంలో ఉదయం 06:30 AM నుండి 1:00 PM. వరకు పర్యటించారు.
గ్రామంలో 5,8,10,11,12 వ వార్డులలో నీరు సరిపడా రావడం లేదని ప్రజలు తెలుపగా, మిషన్ భగీరథ అధికారులు ఆ వార్డులో సరిపడా నీటిని అందిచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
మిషన్ భగీరథ త్రాగునీటి ట్యాంకులను ప్రతి నెల 1,11,21 వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేసి, తగిన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలన్నారు.


ప్రజలు మిషన్ భగీరథ మంచి నీటినే త్రాగాలని అందుకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
గ్రామంలోని SC వాడలో విద్యుత్ మెయిన్ లైన్ తో… ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుపగా, ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
హనుమాన్ మందిరం నుండి బసవేశ్వర విగ్రహం వరకు మరియు బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మరియు తదితర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలన్నారు.
మండలం మరియు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ… మంచి సేవలు అందిస్తున్న AE సురేష్ రెడ్డి ని లైన్ మెన్ విక్రమ్ లను అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క బంట్వారం గ్రామానికి ఇప్పటివరకు పెన్షన్ ల రూపంలోనే 9 కోట్ల పై చిలుకు అందించడం జరిగిందన్నారు.


శానిటేషన్ సరైన పద్దతిలో చేయాలని ప్రతిరోజూ చెత్త సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
బంట్వారం PHC లో పనిచేస్తున్న డాక్టర్ ప్రతిరోజు సమయానికి రావాలని, ప్రజకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు, ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న ఫార్మసిస్ట్ అమరేందర్ ను అభినందించారు.
బంట్వారం గ్రామ పంచాయతీకి రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు 13 కోట్ల 24 లక్షల రూపాయలు రైతులకు ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు.
మరణించిన 25 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా 1.25 లక్షలు (ఒక కోటి ఇరవై ఐదు లక్షలు రావడం జరిగిందన్నారు.
గ్రామంలో ప్రతీ ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని కచ్చితంగా వాడుకలో ఉంచాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page