అంతా కుక్కే చేసిందంట

Spread the love

ఆ రోజు ఎస్పీ చెప్పిందే..ఈ రోజు సీబీఐ చెబుతోంది

ప్రతి కేసులోనూ ఎవరో ఒకరిని బలి చేసి తాను తప్పించుకోవడం కాకాణికి అలవాటే

నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసుపై ఎవరో అడిగితే సీబీఐ విచారణకు ఆదేశించలేదు

అసాధారణమైన నేరంగా పరిగణించి హైకోర్టే సుమోటోగా ఆదేశించింది

తలకిందులుగా తపస్సు చేసినా అంతిమంగా నేను పెట్టిన కేసుల్లో జైలుశిక్ష నుంచి కాకాణి తప్పించుకోలేడు

ఎనిమిదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడి ఇంటి చుట్టూ తిరిగి ఆయన కాళ్లు పట్టుకుని ప్రాధేయపడిన విషయం మరిచిపోవద్దు

రోడ్లపై అడుక్కుతింటూ బతికిన కాకాణికి మా నాయకుడిని విమర్శించే స్థాయి లేదు

, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు కోర్టులో జరిగిన కాకాణి ఫైళ్ల దొంగతనం కేసులో ఈ రోజుకి కుక్కే గెలిచింది

అప్పటి ఎస్పీ విజయరావు ఏమి చెప్పారో. సీబీఐ అదే చెప్పింది

పాత ఇనుము కోసం ఇద్దరు దొంగలు కోర్టు ఆవరణలోకి వెళితే కుక్క అరిచింది. 17 కోర్టులున్న సముదాయంలో కాకాణి కేసుకు సంబంధించిన ఫైళ్లు ఉన్న కోర్టులోకే దొంగలు వెళ్లేలా కుక్క మరోసారి మొరిగింది. దొంగలను ఆ కోర్టు మిద్దె ఎక్కేలా చేసింది కూడా కుక్కే. ఆ కోర్టు భవనంలో 11 అల్మారాలు ఉండగా కాకాణి కేసు ఫైళ్లు ఉన్న అల్మారాను పగలగొట్టే వరకూ కుక్క మొరుగూతూనే ఉంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఆధారాలైన ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ తీసుకునే వరకు కుక్క అరుస్తూనే ఉంది. ఈ ఘటన అంతటికి కుక్క అరవడమే కారణమని అప్పటి ఎస్పీ విజయరావు సెలవిచ్చారు

కోర్టు ఆవరణలో 15 వేల కేసులకు సంబంధించిన ఫైళ్లు ఉంటే వారికి ఒక్క కాకాణి కేసుకు సంబంధించిన ఆధారాలున్న ఫైలు మాత్రమే దొరికిందా

సరే..ఫ్లాట్ ఫారంపై బతికే ఆ చిల్లర దొంగలు ల్యాప్ టాప్, మొబైల్ లోని డేటాను కూడా కుక్క డైరెక్షన్ లోనే తొలగించారా

ఇప్పటికి సీబీఐ చార్జిషీటు మాత్రమే ఫైలు చేసింది. కోర్టు అనుమతించి కేసు క్లోజ్ చేయవచ్చు. లేదా మళ్లీ రివ్యూ చేసి పునర్విచారణకు ఆదేశించే అవకాశమూ ఉంది

అప్పుడే కాకాణి గోవర్ధన్ రెడ్డి భుజాలెగరేసుకుంటూ టపాసులు కాల్చుకుని సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది

చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకుని పిసికిని నువ్వు ఆయన్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతావా.

నకిలీ మద్యం కేసుల్లో నుంచి తప్పించమని బతిమలాడినోడిని నువ్వు

రోడ్లమీద అడుక్కుతింటూ బతికిన నువ్వు చంద్రబాబు నాయుడిపై వాడుతున్న భాష ఏంటి

నువ్వు 8 కేసులు, మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి 31 కేసులు ఎదుర్కొంటూ నిజాయతీపరుడైన మా నాయకుడు చంద్రబాబు నాయుడి గురించి అవాకులు, చెవాకులు పేలుతారా

ప్రస్తుతానికి కుక్క గెలవచ్చేమో. నేను పెట్టిన నకిలీ డాక్యుమెంట్ల అసలు కేసులో మాత్రం నీకు ఏడేళ్ల శిక్ష తప్పదు కాకాణీ.

క్రిమినల్, సివిల్ డిఫర్మేషన్ కేసుల్లోనూ తప్పించుకోలేవ్

ఈ రోజు కోర్టులోని ఆధారాలను దొంగలించడానికి కష్టపడినట్టుగానే ఆ రోజు నకిలీ పత్రాలు, స్టాంపులు సృష్టించడానికి శ్రమించావ్

ఆ ముఠా సభ్యులను కూడా రూ.10 లక్షలకు కాంట్రాక్టు మాట్లాడుకుని రూ.50 వేలు మాత్రమే ఇచ్చి వాళ్లని మోసం చేశావ్. చివరకు నువ్వు పారిపోయి వారిని జైళ్లో పెట్టించావ్

ఇప్పుడు కోర్టులో జరిగిన దొంగతనం కేసులోనూ చిల్లర దొంగలను జైలుకు పంపి నువ్వు సేఫ్ గా ఉన్నావ్

నకిలీ మద్యం కేసులోనూ నీ సహచరులందరూ జైలుకు పోయారు. నీ సహ నిందితుడు, ఇంటర్నేషనల్ స్మగ్లర్ అప్పూ జైలులోనే చచ్చిపోయాడు. నువ్వు మాత్రం తప్పించుకున్నావ్

నకిలీ పత్రాల కేసులో సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకుని ఆర్నెళ్ల పాటు రోజూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ ముందు నిలుచుని సంతకం పెట్టివచ్చావ్

ఇంత నీచ చరిత్ర కలిగిన నువ్వు మా నాయకుడు చంద్రబాబు నాయుడిని నోటికొచ్చినట్టు మాట్లాడుతావా

ఈ కేసులోనూ సీబీఐ విచారణ నువ్వు కోరలేదు. నేనూ అడగలేదు

నెల్లూరు కోర్టులో జరిగింది అసాధారణమైన ఘటనగా గుర్తించిన జిల్లా న్యాయమూర్తి ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించారు

హైకోర్టు కూడా తీవ్రమైన నేరంగా పరిగణించి సుమోటోగా సీబీఐ విచారణకు ఆదేశించింది

ఈ అఫిడవిట్ ను హైకోర్టు కచ్చితంగా సమీక్షిస్తుందనే నమ్మకం నాకుంది. లేకపోయినా నేను పెట్టిన కేసులో కాకాణికి శిక్ష తప్పదు

కోర్టులో జరిగిన ఫైళ్ల దొంగతనం కారణంగా అంతిమ లబ్ధి పొందేది కాకాణి గోవర్ధన్ రెడ్డే. ఉపహార్ కేసు తరహాలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయం

నేను పెట్టిన కేసుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిని భగవంతుడు కూడా కాపాడలేడు

ప్రతి కేసులోనూ ఎవరో ఒకరిని బలి చేయడం కాకాణికి అలవాటుగా మారిపోయింది

క్రిమినల్ కేసుల విషయంలోనే కాదు. పాలనాపరంగా చేస్తున్న అక్రమాల విషయంలోనూ అధికారులను బలిచేస్తున్నాడు

కాకాణి చెప్పిందల్లా చేసిన పొదలకూరు తహసీల్దారు స్వాతి సస్పెన్షన్ లో ఉన్నారు. ఐదుగురు జైళ్లకు పోయారు. భూకుంభకోణాలకు పాల్పడిన కాకాణి మాత్రం క్షేమంగా ఉన్నాడు

తలకిందులుగా తపస్సు చేసినా జైలు శిక్ష నుంచి కాకాణి తప్పించుకోలేడు. నకిలీ డాక్యుమెంట్ల కేసులో పక్కా ఆధారాలున్నాయి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సింది సీబీఐనే కదా..ఎందుకు అరెస్ట్ చేయలేదు

అంతిమంగా అన్ని విషయాలను కోర్టులు తేలుస్తాయి

నకిలీ పత్రాల కేసులో శిక్ష నుంచి బయటపడటానికి ఎవరి రెకమండేషన్ నా దగ్గర పనికిరాదని గుర్తుంచుకో కాకాణి గోవర్ధన్ రెడ్డీ.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page