SAKSHITHA NEWS

బొత్స విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలి

పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి…

సాక్షిత :- పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రచారం లో భాగంగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు పెందుర్తి నియోజకవర్గం లో గల ఎంపీపీలు , జడ్పిటిసిలు, ఎంపీపీలు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విచ్చేసారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయమే లక్ష్యంగా పని చేద్దామని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు.

ముందుగా తివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స మాట్లాడుతూ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి న పై ఎంతో నమ్మకం తో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా పేరు ఖరారు చెయ్యడం జరిగిందన్నారు. ఎంపీటీసీ లు , జడ్పీటీసీ లు, కార్పొరేటర్లు, అందరూ ఐక్యమత్యం తో నిలిచి నాకు ఓటు వేసి అత్యధిక ఘానా విజయం అందించాలి అన్నారు. ఎమ్మెల్సీ స్థానం పరిధిలో వైసీపీకి 500 పైగా ఓట్లు ఉన్నాయని అందరూ సమిష్టిగా ఉంటే గెలుపు మనదే అని అన్నారు, అయినప్పటికీ కూటమి ప్రభుత్వానికి కనీస కోట్లు లేనప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో వైసిపి ఎంపీటీసీలు కార్పొరేటర్ల ను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కీలకమైనదని , దీంట్లో ఘనవిజయం సాధించి వైసిపి బలాన్ని చూపించాలన్నారు.


SAKSHITHA NEWS