124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్-2 కమిటీ హల్ వద్ద తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రాం పేరుతో అన్ని శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సమావేశం ఆల్విన్ కాలనీ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్-1, ఫేస్-2, ఆదిత్య నగర్, చక్రధరి నగర్, సాయి నగర్ ఈస్ట్, రాఘవరేంద్ర కాలనీ, ఆల్విన్ కాలనీ జయశంకర్ కాలనీలలోని సమస్యలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు. అధికారులే మన దగ్గరికి వచ్చారు కాబట్టి కాలనీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎటువంటి సమస్య ఉన్న వారి దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని తెలిపారు. అధికారులే మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్ మరియు రాజేష్ చంద్ర, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజ్ గౌడ్, కృష్ణారావు, భాస్కర్ రెడ్డి, కట్టా శ్రీనివాసరావు, వెంకటేష్ గౌడ్, సంపత్ రెడ్డి, ఇస్మాయిల్, నాగభూషణం, మల్లేష్ గౌడ్, రమేష్, ప్రసాదరావు, స్వరూపా రాణి, నిరంజన్ పోశెట్టిగౌడ్, బాలస్వామి, సుధాకర్ రెడ్డి, ఉమేష్, సుధీర్ రెడ్డి, సలీమ్, సంతోష్ బిరాదర్, కూర్మయ్య, మనోజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. GHMC అధికారులు జలమండలి మేనేజర్ ఝాన్సీ, AE శ్రావణి, ఎంటమాలజీ AE ఉషారాణి, డాక్టర్ సౌమ్య, వర్క్ ఇస్పెక్టర్స్ రవి కుమార్ మరియు రవీందర్ రెడ్డి, ఎంటమొలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, అర్బన్ HA నాగరాణి, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ నరేష్, SFA వెంకట రెడ్డి మరియు శ్రీనివాస్, పోలీస్ శాఖ కె.పాండురంగ చారి, సూపర్వైజర్ శివ, లైన్ మ్యాన్ రవి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.