సాక్షిత ప్రతినిధి. భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో డా|| బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన పుర ఛైర్మన్ ఎడ్మ సత్యంమాజీ సర్పంచ్ బృంగి ఆనంద్*.
నేడు బాబాసాహెబ్ 132వ జయంతి సందర్భంగా కల్వకుర్తి లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుర చైర్మన్ ఎడ్మ సత్యం. మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తు సమానత్వం, సమన్యాయం అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ఆశించిన దార్శనికుడు అంబేద్కర్. కుల, మత రహిత బడుగు బలహీన వర్గా అభ్యున్నతికోసం తపించిన జాతీయ వాది అంబేద్కర్. ఆయన ఆశయాలను సాకారం చేయడానికి ప్రతి ప్రభుత్వం కృషిచేయాలి. ఇది అందరి బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, మునిసిపల్ మాజీ ఛైర్మన్ రాచోటి శ్రీశైలం కౌన్సిలర్లు బాలు నాయక్, సూర్య ప్రకాష్ రావు, గోరేటి శ్రీనివాస్, సైదులు గౌడ్, భోజిరెడ్డి, మనోహర్ రెడ్డి, కిశోర్ రెడ్డి, బావాండ్ల మధు, నూనె శ్రీనివాస్, కనుక సత్యనారాయణ, దుర్గయ్య సాగర్, శేఖర్, జహంగీర్, నారాయణ మూర్తి మునిసిపల్ స్టాఫ్ హోమ్లాల్ తదితరులు పాల్గొన్నారు.