SAKSHITHA NEWS

అంబర్ పేటలో ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం


సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్ పేటలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో “మహిళా సంక్షేమ దినోత్సవం” కార్యక్రమం ఘనంగా జరిగింది

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ, మహిళామణులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ,
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు
పుట్టిన ఆడబిడ్డ నుంచి అవ్వల వరకు అందరినీ కేసీఆర్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుతోందని గర్భిణులకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్లు ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి అడుగని ఆయన చెప్పారు. కేసీఆర్ కిట్, అమ్మఒడి, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలతో పాటు , అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలకు జీతాల పెంపు, అలాగే మహిళల భద్రతకు షీ టీమ్స్, భరోసా, సఖీ కేంద్రాలు వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో సీపీడీఓ జ్యోత్స్న, ఎమ్మార్వో లలిత, నోడల్ ఆఫీసర్ ఆశన్న, ఏఎంహెచ్ఓ జ్యోతి, డిఇఓ విజయలక్ష్మి, డా|| దీప్తి పటేల్, పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


SAKSHITHA NEWS