కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీ వాసులు ఇటీవల సోనియమ్మ ప్రకటించిన 6 గ్యారంటీలకు మరియి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్బంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేసీయార్ నియంత పాలనకు చరమగీతంపాడే రోజు త్వరలోనే ఉందని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి కాంగ్రెస్ గ్యారంటీలను తీసుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పని చేయాలనీ కోరారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు , యువజన కాంగ్రెస్ నాయకులు, INTUC నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పని
Related Posts
ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన
SAKSHITHA NEWS ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన సాక్షిత వనపర్తి రాష్ట్రంలోరూ. 7800 కోట్లకు పైగా ఉన్న విద్యార్థ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం…
జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం…
SAKSHITHA NEWS •జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం… సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్.. సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లాఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని…