ప్రతినెలా ధరలు పెంచుతుంటే ఎలా….? – తిరుపతిలో కాంగ్రెస్ నిరసన సాక్షిత, తిరుపతి బ్యూరో : బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా వరస పెట్టి నిత్యావసరాల ధరలు పెంచుతూ పోతే సామాన్యుడు ఎలా బతకాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రమీలమ్మ, నగర అధ్యక్షుడు మాంగాటి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు శుక్రవారం నిరసన తెలిపారు. అలాగే మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఖాళీ సిలిండర్లు పెట్టుకుని ప్రదర్శన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి నిత్యవసర సరుకుల రేట్లు ప్రతి నెలకు ఒకసారి పెరుగుతున్నాయని ఆరోపించారు. గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయని, గతంలో నిత్యవసర సరుకులు నెలకు 3వేలు రూపాయలకు కొనే సరుకులకు ఇప్పుడు 8 వేలు అయ్యాయని పేర్కొన్నారు. సామాన్యుడిపై పెను భారం పడుతున్నా మోదీ మాత్రం మౌనంగా ఉంటారని ఎద్దేవా చేశారు. బీజెపీ తో లోపాయికారీ పొత్తు సాగిస్తున్న వైసిపి మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆఫీసును సీజ్ చేయడం తగదన్నారు.
వాజ్ పాయ్ ఉన్నప్పటి బిజెపి కి, ప్రస్తుతం ఉన్న బిజెపికి చాలా తేడా ఉందనీ వ్యాఖ్యానించారు.
మోదీ వచ్చాక ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష పూరిత, ప్రతీకార రాజకీయ వేధింపులు చేయడమే పనిగా పెట్టుకున్నారు నీ తెలిపారు. 8 ఏళ్ల పరిపాలనలో ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. కొందరు ఎపీ ఎంపీల తీరు వల్ల రాష్ట్రం పరువు మంటగలిసిందన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ తెచ్చిన అనేక మంచి ప్రాజెక్టులు ఆపేశారని మండిపడ్డారు.
ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ లీగల్ సెల్ తిరుపతి జిల్లా చైర్మన్ రవి, పిసిసి కార్యదర్శి యార్లపల్లి గోపి గౌడ్, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జి పంటా శ్రీనివాస్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ చార్జి పూల చంద్రశేఖర్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకుమార్, తీగల భాస్కర్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పూతలపట్టు ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తేజోవతి, శాంతి యాదవ్, రామచంద్ర, రావణ్, మైనారిటీ సెల్ నాయకులు జావెద్. హమిన్ ఉల్లా , అఖిల భారత ఓబిసి కోఆర్డినేటర్ మురళీకృష్ణ, మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నన్నేఖాన్, ఎస్ టి సెల్ జిల్లా అధ్యక్షులు పి సిద్దయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట నరసింహులు, జిల్లా ఏయూ డబ్ల్యూ ఇ సి అధ్యక్షులు భాస్కర్, ఎన్ ఎస్ యు ఐ స్టేట్ సెక్రటరీ మల్లికార్జున, జిల్లా వైస్ ప్రెసిడెంట్ డి రమేష్ బాబు, నగర ప్రధాన కార్యదర్శి ప్రేమ్ సాగర్, బి గోపి గౌడ్, నగర ఉపాధ్యక్షులు పి పార్థసారథి, మహిళా సెక్రెటరీ సుప్రజా తదితరులు పాల్గొన్నారు.
ప్రతినెలా ధరలు పెంచుతుంటే ఎలా….? – తిరుపతిలో కాంగ్రెస్ నిరసన
Related Posts
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల వినాయక పార్క్
SAKSHITHA NEWS వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల వినాయక పార్క్ లో సీనియర్ సిటీజన్స్ మరియు యోగ భవనం కు వచ్చే వారి సౌకర్యార్థం కోసం PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ స్వంత నిధులతో…
మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించిన ప్రైవేటు కాలేజెస్ స్కూల్స్ ప్రతినిధులు
SAKSHITHA NEWS మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించిన ప్రైవేటు కాలేజెస్ స్కూల్స్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు…