SAKSHITHA NEWS

నంద్యాల జిల్లా శ్రీశైలం

సొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే మంచినీటి సమస్య లేకుండా చేస్తా ..ఎమ్మెల్యే శిల్ప

దశాబ్దాలనాటి నుంచి మంచినీటి సమస్యతో అల్లాడుతున్న సున్నిపెంట గ్రామ ప్రజలు..!

త్వరలో కొత్త మోటర్లు తెప్పించి సున్నిపెంట గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి..!

శ్రీశైలం మండలం సాక్షీత ఏప్రిల్:24:దశాబ్దల నాటి నుంచి శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో మంచి నీళ్ల సమస్యతో గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు అయితే వై.ఎస్.ఆర్. సిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండో విడతలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి రెండవ రోజు సున్నిపెంట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని సుండిపెంట గ్రామంలో మంచినీటి సరఫరా ప్రజల పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకొని నీటిపారుదల శాఖ అధికారులు తో పాటు ఎమ్మెల్యే శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు మంచినీటి సరఫరా గురించి అధికారులను స్వయంగా అడిగి తెలుసుకుని అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సున్నిపెంట గ్రామంలో మంచినీటి కోసం స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇకమీదట పడాల్సిన అవసరం లేదని నా సొంత డబ్బు పెట్టైనా సరే ఇకమీదట మంచినీటి సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే అన్నారు ఇప్పటికే ప్రభుత్వం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సున్నిపెంట గ్రామంలో వాటర్ నూతన ట్యాంకులను పైప్ లైన్లు వేయించామని అంతేకాకుండా గతంలో ఉన్న మోటర్లు గంటకు లక్ష లీటర్లు మాత్రమే డ్యామ్ నుండి ఫిల్టర్ హౌస్ కి పంపిని అవుతున్నాయని ఆ మోటర్ కంటే ఇంకా ఆధునిక మైన మోటర్లు గంటకు రెండు లక్షలు లీటర్లు నీరు పంపించేసే మోటర్లు చెప్పిస్తానని ఎంత ఖర్చైనా సరే నా సొంత డబ్బుతో మంచినీటి సమస్య తీరుస్తానని ఆయన మీడియాతో అన్నారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు రెవిన్యూ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది, గ్రామ వాలంటరీలు, సచివాలయం సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్యదర్శి రజాక్, భరత్ రెడ్డి, ఆసాది ప్రవీణ్ దివ్యతేజ, వట్టి వెంకటరెడ్డి, జింకా గుండయ్య యాదవ్, జింక రాజశేఖర్, ఏకుల జనార్ధన్, పాపారావు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


SAKSHITHA NEWS