మంగళగిరి న్యూ బ్యాంక్ కాలనీ నందు నివాసం ఉంటున్న వెంకటేష్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి చెయ్యి విరిగి ఆస్పత్రి నందు చికిత్స పొందుతూ ఏ పనికి వెళ్లకపోవడం వలన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని జీవనోపాధి లేక చిన్న పిల్లలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక నాయకులు ద్వారా తమ ఇబ్బందులను ఎమ్మెల్యే ఆర్కే కి తెలియజేశారు.
ఎమ్మెల్యే ఆర్కే ఈరోజు మంగళగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతుల మీదుగా సుమారు మూడు నెలలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేయడం జరిగింది.
తమ ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని వెంటనే సహాయం చేసినందుకు వెంకటేష్ భార్య లక్ష్మి ఎమ్మెల్యే ఆర్కే కి, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసింది.