పర్యావరణ హితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమతం.
మట్టితో చేసిన గణనాథులను పూజిద్దాం.
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
పర్యావరణ హితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతం అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. మదర్ థెరిసా ఛారిటబుల్ ట్రస్టు కోయ సుధ ఆధ్వర్యంలో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను, మొక్కలను ద్వారక తిరుమల చైర్మన్ ఎస్.వి.ఎన్ నివృతరావు తో కలసి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మైలవరంలో పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించారని గుర్తు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇలా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను ప్రోత్సహిస్తే మనం కచ్చితంగా నీటి కాలుష్యాన్ని చాలావరకు నియంత్రించవచ్చన్నారు. ప్రకృతికి నష్టం కలిగించే పదార్థాలతో కాకుండా మట్టితో తయారు చేసే విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది ఇలా మట్టి గణనాథుని విగ్రహాలను భారీగా రూపొందించి ప్రజలకు పంపిణీ చేస్తున్న మదర్ థెరిసా ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మైలవరం ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.