ఉద్యోగుల సానుకూల ప్రభుత్వం మాది
సమస్యలు వినడానికి, పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం
ఉద్యోగ సంఘాల నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
ఉద్యోగుల పట్ల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్ఫథంతో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) సభ్యులు ఉప ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు వివరించారు.ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీజీఈజేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్,సెక్రెటరీ ఏలూరి శ్రీపివాసన రావు, తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవరకొండ సైదులు ఇతర ముఖ్యనాయకులు 39 డిమాండ్లను ఆయన ముందుంచారు.
ఉప ముఖ్యమంత్రి ముందుంచిన డిమాండ్లలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పే రివిజన్ కమిషన్ రిపోర్టును వెంటనే తెప్పించుకుని అమలు, ఉద్యోగులకు 51 శాతం పిట్ మెంట్ ను అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటు, ఉద్యోగులకు సంబంధించిన ఈ కుబేర్ లో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటను క్లియర్ చేయాలి. ఈ కుబేర్ సిస్టమ్ ను రద్దు చేయాలని వారు ఉప ముఖ్యమంత్రిని కోరారు. ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగివారిన పాత స్టేషన్ కు బదిలీ చేయాలి. సీపీఎస్ ను రద్దు చేయాలి. జీఓ 317ను సమస్యలను వెంటనే పరిష్కరింయాలి. ఎంప్లాయిస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ ను పునరుద్దరించాలని కోరారు.
జేఏసీ నాయకుల డిమాండ్లపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని స్పష్టంగా చెప్పారు. సమస్యల ఆపరిష్కారానికి ఉద్యోగులతో ప్రభుత్వం ఎన్నిసార్లు అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు