మొబైల్‌ తరహాలోనే విద్యుత్‌కూ రీచార్జ్‌

SAKSHITHA NEWS

దేశంలో 19.79 కోట్ల సర్వీసులకు ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చాలనుకుంటున్న కేంద్రం
మొబైల్‌ ఫోన్‌ మాదిరిగా ముందుగానే రీచార్జ్‌ చేసుకునే అవకాశం

రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ ద్వారా మార్గదర్శకాలు జారీ
రాష్ట్రంలో ఇప్పటికే మొదలైన స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ
విద్యుత్‌ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్‌ మీటర్ల నెట్‌వర్క్‌ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌)లో భాగంగా దేశవ్యాప్తంగా 19.79 కోట్ల విద్యుత్‌ సర్వీసులు, 52.19 లక్షల డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌), 1.88 లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్‌ లేదా స్మార్ట్‌మీటర్లు బిగించాలనుకుంటోంది.

ఈ మేరకు మీటర్ల బిగింపు, అమలు ప్రక్రియపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) జారీ చేసింది. ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంతమేర విద్యుత్‌ వాడుతున్నారో ఆ మేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ముందుగా చెల్లించి రీచార్జ్‌ చేసుకోవాలి. రీచార్జ్‌ మొత్తం అయిపోగానే వినియోగదారుల మొబైల్‌కు మూడుసార్లు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం పంపాలి.

ప్రతి కస్టమర్‌కు రూ.300 అరువు ఇచ్చేలా..
ప్రతి వినియోగదారునికీ గరిష్టంగా రూ.300 క్రెడిట్‌ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే రూ.1,000 రీచార్జ్‌ చేసుకుంటే అదనంగా రూ.300 కరెంట్‌ను వాడుకునే వెసులుబాటు కల్పించాలి. ముందుగా చెల్లించిన రూ.1,000లో వినియోగం పూర్తవుతూ రూ.50 మిగిలి ఉండగానే రీచార్జ్‌ చేసుకునేలా తొలి సందేశం పంపాలి. రీచార్జ్‌ మొత్తం అయిపోయాక మరోసారి, క్రెడిట్‌గా ఇచ్చిన రూ.300 కరెంట్‌ను వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి ఆ తరువాత విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని (డిస్‌కనెక్ట్‌) కేంద్రం సూచించింది.

వినియోగదారులు మళ్లీ రీచార్జ్‌ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించాక మొబైల్‌లో సంబంధిత యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలని, వినియోగదారులు ఈ యాప్‌ ఆధారంగా విద్యుత్‌ వినియోగాన్ని నియంత్రించుకోవచ్చని పేర్కొంది. అంటే విద్యుత్‌ అవసరం లేనప్పుడు మీటర్‌ను ఆఫ్‌ చేసుకోవడం ద్వారా బిల్లును ఆదా చేసుకోవచ్చు.

రాష్ట్రంలో మొదలైన ప్రక్రియ
విద్యుత్‌ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్‌ఎస్‌) పథకంలో భాగంగా స్మార్ట్‌ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలోని మూడు డిస్కంలు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్‌ సర్వీసులకు, వాణిజ్య, పరిశ్రమలు, గృహæ విద్యుత్‌ సర్వీసులకు ప్రీ-పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి.

మొదటి విడతలో దక్షిణ డిస్కం పరిధిలో 6.19 లక్షల సింగిల్‌ ఫేజ్‌ మీటర్లు, 2.56 లక్షల త్రీ ఫేజ్‌ మీటర్లను ఏర్పాటు చేయనుండగా.. మధ్య డిస్కం పరిధిలో 7.23 లక్షల సింగిల్‌ ఫేజ్‌ మీటర్లు, 1.09 లక్షల త్రీ ఫేజ్‌ మీటర్లు అమర్చనున్నారు. తూర్పు డిస్కం పరిధిలో 6.09 లక్షల సింగిల్‌ ఫేజ్‌ మీటర్లు, 1.15 లక్షల త్రీ ఫేజ్‌ మీటర్లను అమర్చనున్నారు. స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్‌ బాధ్యత మొత్తం సర్వీస్‌ ప్రొవైడర్లదే.

ఈ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార (టైం అప్‌డే) టారిఫ్‌ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్‌ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే ఆఫ్‌ పీక్‌ సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్‌ లాభం పొందే అవకాశం ఉంది. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్‌ సరఫరా చేసే సమయం, విద్యుత్‌ నాణ్యత తెలుసుకునే అవకాశం ఉంది.

WhatsApp Image 2024 02 29 at 6.21.00 PM

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…


SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page