సాక్షి త ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. డిపిఆర్సీ సమావేశ మందిరంలో ఎఇఓ లు, సిసిఎల్ఏ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఎన్నికల కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ పై చేపట్టిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ కీలకం కావున ఏ దశలోనూ తప్పిదానికి తావివ్వకూడదనే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో 99 శాతం సక్సెస్ అయినా ప్రశంసలు రావని, 1 శాతం పొరపాటు జరిగిన దాని ప్రభావం మొత్తం ఎన్నికల ప్రక్రియ పై పడుతుందని అన్నారు. స్వేచ్ఛయుత వాతావరణం, పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 1459 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు, వీటి సంఖ్య స్వల్పంగా పెరగవచ్చని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ దిశగా జిల్లాలో 750 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు. వెబ్ కాస్టింగ్ ప్రక్రియ ను రిటర్నింగ్ అధికారి నుండి, జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణ చేస్తుందన్నారు. పోలింగ్ డే చాలా ముఖ్యమని, జాగ్రత్తగా ఉంటూ, పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ పట్ల అన్ని చర్యలు నిబంధనల మేరకు చేపట్టాలని, ఎన్నికల విధులను ఏ దశలోను లైట్ గా తీసుకోవద్దని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాస్, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.