SAKSHITHA NEWS

సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జన్మదిన వేడుకలు. జగిత్యాల ఎప్రిల్ 6 : తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్, ,పెన్షనర్స్ అసోసియేషన్ల జగిత్యాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో 85 ఏళ్ల వృద్ధులకు ఇంటి నుంచే ఓటు సౌకర్యం పై, వయోవృద్ధుల రక్షణ,పోషణ సంక్షేమ చట్టం పై వయోధికులకు,సఖి ,మహిళా చట్టాలపై వక్తలు అవగాహన కల్పించారు.శనివారం తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ కార్యాలయం కౌన్సెలింగ్ కేంద్రంలో జరిగిన అవగాహన కార్యక్రమాల్లో సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ జన్మదిన వేడుకల్లో 20 మంది నిరుపేద వయోధికులకు పాదరక్షలు,గొడుగులు హరి ఆశోక్ కుమార్ అందజేశారు.

అనంతరం హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ పిల్లల నిరాదరణ కు,వేధింపులకు గురవుతున్న తల్లిదండ్రులైన వయోవృద్ధులకు ,కొడుకులు,కొడళ్లకు, సీనియర్ సిటీజేన్స్,మహిళా ప్రతినిధులకు వయో వృద్ధుల చట్టం పై అవగాహన కల్పించారు.,సఖి సేవలపై,మహిళా చట్టాలపై సఖి సీ.ఈ.ఓ.జాన్సన్,శారద,మంజరి,జలజ లు అవగాహన కల్పించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచనల మేరకు వయోధికులకుఅండగా ఉంటూ ఆర్డీవోలకు వారి సమస్యల పరిష్కారం కు కేసులు దాఖలు జేస్తూ వారి సంక్షేమంకు కృషిచేస్తున్న సీనియర్ సిటీజేన్స్ జిల్లా,డివిజన్,మండల,గ్రామాల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్,ప్రధాన కార్యదర్శి నాగేందర్ రెడ్డి, ఆర్డీవో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్ తఫజుల్ హుస్సేన్,సీనియర్ సిటీజేన్స్ గౌరవ సలహాదారు జీ.ఆర్.దేశాయ్,ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కౌన్సెలింగ్ అధికారులు పి.సి.హన్మంత్ రెడ్డి,పబ్బా శివానందం,ఉపాధ్యక్షుడు ,ఎం.డి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొయ్యడ సత్యనారాయణ, కళాశ్రీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గుండేటి రాజు,బొమ్మేన అధ్యక్షుడు అల్లూరి బాపు రెడ్డి, జిల్లా టీ బీసీ జేఏసీ జిల్లా కార్యదర్శి ములస్తం శివ ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, మహిళా జిల్లా కార్యదర్శి గంగం జలజ,బక్కశెట్టి లక్ష్మీ,మదురమ్మ, వివిధ సంఘాల నాయకులు సీనియర్ న్యాయవాది పి.సతీశ్ రాజ్, జర్నలిస్టు శ్రీశైలం,సింగం గంగాధర్,కండ్లే గంగాదర్,దుబ్బేశం,మారిశెట్టి ఆశోక్,ఎం డి.ఎక్బాల్,సయ్యద్ యూసుఫ్,యాకూబ్ హుస్సేన్, సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్స్,టీ ఎన్జీఓ,టీ రెవెన్యూ,వివిద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు..

WhatsApp Image 2024 04 06 at 7.00.56 PM

SAKSHITHA NEWS