మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

Spread the love

గోపినగర్ కాలనీలో వివిధ సమస్యలపై పర్యటించి పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నెహ్రు నగర్ లోతట్టు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కార్పొరేటర్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్ గణేష్ కట్ట పరిసర బస్తీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. పాదయాత్రల ద్వారా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జవాబుదారీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. నేరుగా బస్తీవాసులను కలుసుకొని స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ బస్తీలో డ్రైనేజీ, తాగునీటి పైపులైన్‌ నిర్మాణాలు చేపట్టిన తరువాత రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ గోపినగర్ లో దాదాపుగా సిసి రోడ్లు పూర్తవ్వగా మిగిలిన కొన్ని చోట్ల నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు డ్రైనేజీ, తాగునీటి పైపులైప్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవసరమైతే వెంటనే కొత్త పైపులైన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. బస్తీల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణను గాడిలో పెట్టాలని ఆ విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా పాదయాత్రలు చేపడుతున్నట్లు కార్పొరేటర్ గారు తెలిపారు.

అనంతరం నెహ్రునగర్ కాలనీలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నెహ్రునగర్ లోతట్టు ప్రాంతాలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అప్రమతంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, కేఎన్ రాములు, అశోక్, నెహ్రునగర్ కాలనీ బస్తీ అధ్యక్షులు షేక్ గఫర్, రమేష్, ప్రవీణ్, గురు సాబ్, రఫీక్, శశి, ఫకృద్దీన్, పాషా, చాంద్, సాయిరాజ్, రవి, రాజు, నర్సింలు, దస్తు, రవి, నాని, రఫీ, రాజేందర్, భార్గవ్, కనకేష్, సరసమ్మ, నర్సింహా, సత్యనారాయణ, దేవిప్రసాద్, నవీన్, నిరూప, దివ్య, శాంతమ్మ, శాంతి, స్వరూప, ఎలమ్మ, కమలమ్మ, జయంతి, దేవి, రాణి, వసంత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page