క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేయాలి — యస్.పి అపూర్వ రావు

Spread the love

క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేయాలి — యస్.పి అపూర్వ రావు

— బాధితులకు న్యాయం జరిగేలా బరోసా కల్పించాలి

— కనగల్, చండూరు, మునుగోడు పోలీస్ స్టేషన్లను సందర్శించిన యస్.పి

నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)

క్రైమ్ రేటుని తగ్గించేందుకు కృషి చేయాలని యస్.పి అపూర్వ రావు అన్నారు.
నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని కనగల్, చండూరు, మునుగోడు పోలీస్ స్టేషన్ లను జిల్లా యస్.పి అపూర్వ రావు సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు గురించి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయాలని అన్నారు.కేసులను త్వరిత గతిన పూర్తిచేసి భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. దొంగతనాలు జరగకుండా పగలు,రాత్రి గట్టి పెట్రొలింగ్ నిర్వహించాలని అన్నారు.సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి గ్రామాలలో ప్రధాన కూడలిలలో,కాలనీలలో సి.సి కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వహులకు అవగాహన పెంచాలని, అన్ లైన్ సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణ కొరకు ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల ఓవర్ స్పీడ్, పరిమితికి మించి ప్రయాణించే వాహనాల పైన స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అక్రమ గంజాయి, పీడీఎస్ రైస్,జూదం లాంటి కార్యకలాపాల పైన అను నిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పగలు రాత్రి గట్టి పెట్రొలింగ్ మరియు బీట్లు నిర్వహించాలని బ్లూకోర్ట్స్, పెట్రో మొబైల్ పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిoచి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని, సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం, బరోసా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యస్.పి వెంట నల్లగొండ డి.యస్.పి నరసింహ రెడ్డి, చండూరు సిఐ అశోక్ రెడ్డి,కనగల్ యస్.ఐ నగేష్, మునుగోడు యస్.ఐ సతీష్ రెడ్డి చండూరు యస్.ఐ నవీన్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page