SAKSHITHA NEWS

Efforts should be made to control crime with latest technology. District SP

అత్యాధునిక టెక్నాలజీతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి .జిల్లా ఎస్పీ
సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి

పోలీసు అధికారులతో నేర సమీక్షా నిర్వహించిన . జిల్లా ఎస్పీ.శిక్షల శాతం పెంచి బాధితులకు న్యాయం జరిగేలా చేయాలి.


బుధవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు. నేర రహిత సమాజముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు , సిబ్బంది కృషి చేయాలన్నారు. శిక్షల శాతం పెంచి బాధితులకు న్యాయం జరిగేలా చేయాలన్నారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినప్పటీ నుంచి కేసు పూర్తయ్యేంత వరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల విచారణ, వాంగ్మూలం కోర్టుకు సమర్పించడంలో కోర్టు, పోలీస్‌ అధికారులు పనితీరులో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలన్నారు. నేరస్తులకు వారంట్స్‌, సమన్స్‌, సత్వరమే ఎగ్జిక్యూటివ్‌ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


నేరస్తులకు కోర్టులో కఠిన శిక్షణలు పడితే, బాధితులకు న్యాయవ్యవస్థ, పోలీసుశాఖపై నమ్మకం, గౌరవం పెరుగుతుందన్నారు.
కోర్టులో కేసులు వీగిపోకుండా శ్రద్ధ తీసుకోవాలని, బలమైన వాదనలు వినిపించి బాధితులకు న్యాయం జరిగేవిధంగా చూడాలన్నారు.

ప్రతీ కేసులో ఖచ్చితమైన దర్యాప్తు ( క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌) ఉండాలన్నారు.గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌, కేసుల్లో సాక్షులను మోటీవేట్‌ చేయాలన్నారు.
సెన్సెషనల్‌ కేసుల్లో త్వరగా పరిశోధన పూర్తిచేసి చార్జీషీట్‌ దాఖలు చేయాలన్నారు.
పెండింగ్ ట్రయల్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. గ్రామ సందర్శనలు, పల్లె నిద్రలు, ఫ్యాక్షన్‌, లా & ఆర్డర్ మరియు ఇతర సమస్యలను నివారించడానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు గురించి మరియు గుర్తించబడిన గ్రామాలలో సీసీ కెమెరాల సంస్థాపన మరియు పురోగతి గురించి ఆరా తీశారు.

కర్నూలు , పత్తికొండ , ఆదోని సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న యుఐ కేసులు, గ్రేవ్ కేసుల గురించి జిల్లా ఎస్పీ సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.


ఆధునిక టెక్నాలజీ గురించి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇప్పించి నిష్ణాతులను చేస్తామన్నారు. ప్రతి కేసులో దర్యాప్తు త్వరగా చేయాలన్నారు. క్రిమినల్ కేసులు, పట్టదగిన నేరాలు, రోడ్డు ప్రమాదాల కేసులు,రేప్ కేసులలో దర్యాప్తులు జాగ్రత్తగా చేయాలన్నారు. నిజాయితీగా పని చేయాలన్నారు. టెక్నాలజీని బాగా ఉపయోగించి పకడ్బందీగా ఆధారాలు సేకరించాలన్నారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, యుగంధర్ బాబు, శ్రీనివాసులు, వినోద్ కుమార్, కెవి మహేష్ మరియు సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS