SAKSHITHA NEWS

ఉండ్రుగొండను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి

  • ఉండ్రుగొండ లక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: చివ్వెంల మండలం ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ వూర రామ్మూర్తియాదవ్ అన్నారు. ఆదివారం దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ రామ్మూర్తియాదవ్, గౌరవాధ్యక్షులుగా డాక్టర్ ఆదుర్తి రామయ్య, ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరం రవిచంద్రలు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రకృతి రమణీయతతో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఉండ్రుగొండ లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. ఉండ్రుగొండను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర టూరీజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రెండున్నరకోట్ల రూపాయలు కేటాయించారని దీంతో ఉండ్రుగొండను అభివృద్ధి చేసేందుకు నూతన అభివృద్ది కమిటీని ఎన్నుకున్నామని త్వరలో ఇతర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. డిసెంబర్ వరకు అభివృద్ది పనులు మొదలు పేట్టి జనవరిలో పెద్ద ఎత్తున మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి కోరుకొని అందుకు ఆలోచించే వారితో కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి టూరీజం అభివృద్ధిపై దృష్టి పెట్టారని ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న రాష్ట్ర టూరీజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి ప్రముక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే సద్గుల చెరువు మినీట్యాంక్బండ్కు నిధులు కేటాయించి నూతనంగా డబుల్ బోట్లను తీసుకొచ్చామని ఇందులో పైన కింద ఒకేసారి 150మంది ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఉండ్రుగొండ ఆలయ అభివృద్ధికి రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన కార్యదర్శి మహేశ్వరం రవిచంద్ర, దేవిరెడ్డి రవిందర్రెడ్డి, రాచర్ల కమలాకర్, తండు శ్రీనివాస్ గౌడ్, ఆకారపు మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.

WhatsApp Image 2024 11 11 at 12.03.48 AM

SAKSHITHA NEWS