SAKSHITHA NEWS

Educational institutions neglecting the welfare of students

విద్యార్థుల భవిత పై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు,జిల్లా అధికారులపై ప్రజావాణిలో ఫిర్యాదు…….బంజారా గిరిజన రాష్ట్ర సమైక్య అధ్యక్షులు శివ నాయక్

……

సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఒకపక్క పెట్రోల్ బంకు మరోపక్క వైన్ షాపులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా పాఠశాలను నిర్వహిస్తున్న శ్రీనిధి గ్లోబల్ ప్రవేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని
జిల్లా కేంద్రంలోని మామ్స్
విజన్ హై స్కూల్ 2019 రిజల్ట్స్ ఫ్లెక్సీలో వేస్తూ ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తున్నారని విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లిన అలాగే గణపురం గత సంవత్సరం పరీక్ష లునాలుగు రోజుల ముందు విద్యార్థికి టీసి ఇచ్చి పంపించి విద్యార్థి భవిష్యత్తు నాశనం చేసిన పాఠశాల ఉపాధ్యాయుల ను సస్పెండ్ చేయాలని ఇంటర్ కళాశాలలో ఎన్.సి.సి నిర్వహించడం లేదని పునః ప్రారంభించాలని జిల్లా విద్యాధికారులకు ఇంటర్ బోర్డు విద్యాధికారులకు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థుల భవితను శూన్యంలోకి నెట్టేస్తున్న అధికారులపై ప్రజావాణిలో కలెక్టర్కు విద్యాధికారుల అందరి కు బాధ్యత వహిస్తున్న జిల్లా కలెక్టర్ పై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి కి ఫిర్యాదు చేసి నట్లు పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థులు విద్యాసంఘాలతో కలిసి ఉద్యమాలు తప్పవని
బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ వనపర్తి జిల్లా అధ్యక్షులు రవి యాదవ్ ఉన్నారు.

WhatsApp Image 2024 06 10 at 17.11.22

SAKSHITHA NEWS