విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి…టీయూటీఎఫ్

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి…టీయూటీఎఫ్

SAKSHITHA NEWS

విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి…టీయూటీఎఫ్

పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలి

ఉపాధ్యాయుల కలలను సాకారం చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు…టీయూటీఎఫ్

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మ పాటిమీది రఘు నందన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి,తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గార్లను కలిసి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని,ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్లకు సంబంధించిన పలు అంశాలపై ప్రాతినిధ్యం చేసారు.ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ నేను తప్పకుండా పరిశీలించి ఉపాధ్యాయులకు న్యాయం చేస్తానని ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మ పాటిమీది రఘు నందన్ రెడ్డి గారు ఎన్నో ఏళ్ల నుండి పదోన్నతులు బదిలీల కొరకు నిరీక్షిస్తున్న ఉపాధ్యాయుల కలలను నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.విద్యా వ్యవస్థలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులు తీవ్ర నిరాశ,నిస్పృహలతో ఉన్నారని,సమాన అర్హతలు మరియు సీనియారిటీ ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులను కాదని సీనియారిటీ లేని ఉపాధ్యాయులతో పండిట్,పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ లుగా అప్గ్రేడ్ చేయడం జరిగిందని.గత ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎస్జీటీ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా సర్వీస్ నిబంధనలు సవరించడానికి ముందున్న ఖాళీలలో స్కూల్ అసిస్టెంట్ భాష పండితులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను నిబంధనల ప్రకారం ఎస్జిటి ఉపాధ్యాయులకు ఈ షెడ్యూల్ లోనే పదోన్నతులు కల్పించాలని, అదేవిధంగా 5571 పీఎస్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి ఇదే పదోన్నతుల్లో వారికి కూడా పదోన్నతో కల్పించి ఎస్జీటీలకు పండిట్,పీఈటీలతో సమన్యాయం చేయాలని కోరారు.రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు కూడా వెంటనే పదోన్నతులు బదిలీలు కల్పించాలని,పీఆర్సీ నివేదికను వీలైనంత తొందరగా తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలని,ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని,చాలా పాఠశాలల్లో స్వీపర్ పోస్టులు లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని సర్వీస్ పర్సన్ లను వెంటనే నియమించాలని,డీఎస్సీ ఆలస్యం అయ్యే పక్షంలో విద్యా వాలంటీర్లను నిర్మించాలని కోరారు.


SAKSHITHA NEWS