డీజిల్, పెట్రోలుపై సుంకాల రూపంలో వసూలు చేస్తున్న వివరాలు ఇవ్వండి – పార్లమెంట్ లో తిరుపతి ఎంపీ గురుమూర్తి.
గత ఐదు సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్‌పై సెస్, సర్ ఛార్జీల రూపంలో విధించబడిన సెంట్రల్ ఎక్సైజ్ సుంకం మొత్తం ఎంత, గత కొన్నేళ్లుగా పెట్రోల్ మరియు డీజిల్‌పై సెస్ రూపంలో కేంద్ర పన్ను పెరిగిందా పెరిగినట్లయితే దాని వివరాలు మరియు కారణాలు తెలుపగలరు, ఆవిధంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన సెస్సు రాష్ట్రాలతో పంచు కోలేదా మరియు రాష్ట్రాలతో పంచుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నద అలా అయితే, దాని వివరాలు మరియు దానికి గల కారణాలు తెలుపగలరు అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బదులిస్తూ ఇబ్బంది కరంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు మరియు ఇతర అభివృద్ధి ఖర్చుల కోసం వనరులను ఉత్పత్తి చేయడానికి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం మరియు సెస్ రేటు పెంచబడ్డాయన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 271 ప్రకారం, పేర్కొన్న ప్రయోజనాల కోసం విధించిన సర్‌చార్జిలు, సెస్‌లు మినహా అన్ని పన్నులు మరియు సుంకాలు కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడతాయని కాలానుగుణంగా ఫైనాన్స్ కమిషన్ సూచించిన ఫార్ములా ఆధారంగా ప్రాథమిక ఎక్సైజ్ డ్యూటీ భాగం నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపకం చేయబడిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంచే సేకరించబడిన వివిధ సెస్‌లు ప్రధానంగా వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించబడతాయని దీని ద్వారా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఈ పథకాలను అమలు చేయడానికి రాష్ట్రాలకు నిధులు బదిలీ చేయబడతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం పెట్రోలు పై రూ.18.50 పై ఆలాగే డీజిల్ పై 14 రూపాయలు సెస్సు, సుంకాల రూపంలో వసూలు చేస్తున్నామని తెలియజేసారు.