ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు.
గతంలో ఉన్న రుణమాఫీ, డ్వాక్రా రుణాలను చంద్రబాబు ఎగ్గొట్టారన్నారు. సింగపూర్ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రతీ నగరంలోనూ హైటెక్ సిటీ లాంటివి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకువస్తామని అబద్ధాలు చెప్పారన్నారు.
కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ వెటకారంగా మాట్లాడారు.
విశ్వసనీయత లేనప్పడు రాజకీయాలు చేయడం ఎందుకు? రాజకీయ నాయకుడంటే.. తాను చనిపోయాక ప్రతీ ఇంట్లో తన ఫొటో, పేదవాడి గుండెల్లో మనం ఉండాలనే తాపత్రయం ఉండాలని సీఎం జగన్ అన్నారు.