సూర్యాపేట : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని డిఎస్పీ రవి అన్నారు.
సూర్యాపేట శ్రీ చైతన్య పాఠశాలలో గత నెలలో నిర్వహించిన ఏ.ఎన్. టి.ఎస్.ఓ ఫైనల్ లెవెల్ పరీక్షలలో సూర్యాపేట శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన 500మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 156మంది స్వర్ణ పతకాలను, 285మంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్ లను సాధించారు. ఈ సందర్భంగా డిఎస్పీ కార్యాలయంలో ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఏదో ఒక రంగంలో అభిరుచి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహిస్తే అత్యుత్తమంగా రాణించవచ్చన్నారు. కార్యక్రమంలో డిజిఎం సుధాకర్, కో ఆర్డినేటర్ నాగేందర్, ప్రిన్సిపాల్ సతీష్, స్కూల్ డీన్ ప్రవీణ్, ఐపీఎల్ ఇంచార్జ్ కె.ఎన్. ఆర్, బ్యాచ్ ఇంచార్జ్ మంగి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
విద్యార్థుల సృజనాత్మక వెలికితీయాలి – డిఎస్పీ రవి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…