భగత్ సింగ్ స్పూర్తితో యువత ముందుకు సాగాలి- డీఎస్పీ కిశోర్ కుమార్
ప్రెస్,క్లబ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతమైన రక్తదాన శిబిరం
సాక్షితప్రకాశం జిల్లా మార్కాపురం: దేశ స్వేచ్చా, స్వాతంత్ర్యాల కోసం ఉరికొయ్యకేగి బలిదానమైన విప్లవ వీరుడు భగత్,సింగ్ స్పూర్తితో యువత ముందుకు సాగాలని మార్కాపురం డీఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ అన్నారు. స్థానిక ప్రెస్,క్లబ్ లో భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని మార్కాపురం ప్రెస్,క్లబ్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా మార్కాపురం డీఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అన్నారు. మార్కాపురం బ్లడ్,బ్యాంకులో రక్త నిల్వలు నిండుకున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రెస్,క్లబ్, ప్రజాసంఘాలు సామాజిక స్పృహతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు పోలీస్,శాఖ కూడా భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. ఈ సందర్బంగా మొత్తం 37 మంది రక్తదానం చేశారు. 70 సార్లు రక్తదానం చేసిన ప్రసాద్ అనే మాజీ సైనికోద్యోగిని ఈ సందర్బంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్,క్రాస్ సొసైటీ మార్కాపురం డివిజన్ చైర్మన్ డాక్టర్ కనకదుర్గ, సీపీఎం డివిజన్ నాయకులు డి.సోమయ్య, ప్రెస్,క్లబ్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షులు రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, ఐజేయూ నాయకులు రమణ, ఎంపీజే రాష్ట్ర నాయకులు రజాక్, రెడ్,క్రాస్ నాయకులు ఆర్కేజీ నరసింహం, మునిసిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు వనజాక్షి, మాజీ కౌన్సిలర్ రాజు, రూబెన్, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.