SAKSHITHA NEWS

పార్లమెంటులో ఆకట్టుకున్న ద్రౌపతి ముర్ము ప్రసంగం

న్యూఢిల్లీ :
కేంద్ర సర్కారు మూడురెట్ల వేగంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. పార్లమెంటులో ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

తమ లక్ష్యం భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌ హౌస్‌గా మార్చడమని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో.. ఇండియా ఏఐ మిషన్ ప్రారంభమైందని చెప్పారు.

ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లుపై చర్యలు తీసుకుం దని ద్రౌపది ముర్ము అన్నారు. మహిళల నేతృత్వంలోని దేశంలో అభివృద్ధి జరగాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.

ప్రభుత్వం యువత విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారికి కొత్తగా ఉపాధి అవ కాశాలను సృష్టించిందని ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తెచ్చామని తెలిపారు.

దేశంలోని మహిళలు వేగంగా సాధికారత సాధించేలా చర్యలు తీసుకుంటామని,ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు . ప్రభుత్వం కొత్త పథకాలను వేగంగా అమలు చేస్తోందని ఆమె తెలిపారు.

సైబర్ భద్రతలో సామర్థ్యా న్ని మరింత పెంచుకోవడా నికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని,ఆమె అన్నారు. డిజిటల్ ఫ్రాడ్‌, సైబర్ క్రైమ్, డీప్‌ఫేక్ వంటివి సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు తీవ్రమైన సవాళ్లని, చెప్పారు. ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ త్వరలోనే అవతరించనుందని ముర్ము అభిప్రాయపడింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app