ఆంధ్రప్రదేశ్లో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్ వైయస్ఆర్ కంటి వెలుగు పథకం కొత్త వెలుగుని ప్రసాదిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5.60 కోట్ల మందికి (అన్ని వయసుల వారికి) కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ 2019లో శ్రీకారం చుట్టారు. మొత్తం ఆరు దశల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
మొదటి దశలో 60,393 పాఠశాలల్లోని సుమారు 66.17 లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించగా.. 4.38 లక్షల మంది విద్యార్థులకి సమస్య ఉన్నట్లు గుర్తించారు. రెండో దశలో ఈ 4.38 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 1.58 లక్షల మందికి కళ్లద్దాలు, 310 మందికి కేటరాక్ట్ సర్జరీలు చేశారు. ఆ తర్వాత మూడో దశలో దాదాపు 39 లక్షల మంది పెద్దవారికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో దాదాపు 12.5 లక్షల మందికి కళ్లద్దాలు, 1.23 లక్షల మందికి కేటరాక్ట్ సర్జరీలను ఉచితంగా చేసి చూపుని ప్రసాదించింది జగనన్న ప్రభుత్వం.