డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం.

Spread the love
  • జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. బుధవారం స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన విగ్రహానికి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐ.పిఎస్ అవినాష్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డిడి కె. సత్యనారాయణ, ఎస్సి కార్పొరేషన్ ఇడి ఏ. శ్రీనివాసరావు, నాయకులు తదితరులు ఉన్నారు. అనంతరం శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రం లో సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, మహనీయుల జీవితాల నుండి పాఠాలు నేర్చుకోవాలన్నారు. మహనీయుల జీవితాలు ఒక సందేశంగా వుంటాయని, వాటిని మార్గదర్శకం చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఉప ప్రధాని గా, 40 సంవత్సరాలకు పైగా ఎంపీ గా, 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నారన్నారు. వ్యవస్థ లో ఉండి, దళితుల కొరకు పోరాడిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. డా. బీఆర్. అంబేద్కర్ రాజ్యాంగ రచనతో, అధికారం రాగానే పోరాడి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు.

ఆధికారంతోఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చవచ్చన్నారు. మహనీయుని జీవితంతో స్ఫూర్తి పొంది, మంచిగా చదువుకొని, ఉన్నత స్థానానికి వెళ్తే, చాలా మందికి మంచి చెయ్యొచ్చన్నారు. దళితుల అభివృద్ధి కి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దళిత బంధు పథకం తో దళితులకు రూ. 10 లక్షలు పెట్టుబడి సాయం క్రింద అందిస్తుందని అన్నారు. చింతకాని మండలంలో ఉన్న మొత్తం 3,600 దళిత కుటుంబాలకు దళిత బంధు లబ్ది చేకూరిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వరి పంట ఎక్కువని, గతంలో కోతలకు తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుండి హార్వెస్టర్ లు వరి కోతకు వచ్చేయని, ఇప్పుడు దళిత బంధు ద్వారా మంజూరయిన హార్వెస్టర్ యూనిట్లు, జిల్లా అవసరాలు తీర్చడమే కాక, ఇతర ప్రదేశాలు, రాష్ట్రాలకు పనికి వెళుతున్నాయని అన్నారు. ఇదివరకు జిల్లాలో 4 డ్రోన్స్ ఉండగా, ఇప్పుడు 26 డ్రోన్స్ ఉన్నాయని, డ్రోన్ తో ఒక్కరోజులో 25 నుండి 30 ఎకరాలు స్ప్రే చేస్తున్నారని, రోజుకు 5 నుండి 10 వేలు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. ఎస్సి గురుకులాల విద్యార్థులకు సక్సెస్ దళిత బంధు యూనిట్ల ఎక్స్పో విజిట్ కు తీసుకొనివెళ్లాలని కలెక్టర్ సూచించారు.

వారంలో 125 అడుగుల డా. బీఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, నెలాఖరుకు డా. బీఆర్. అంబేద్కర్ పేర నామకరణం చేసిన రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఉందని, దళితులకు ఈ సంవత్సరం చిరస్మరణీయమని అన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, మహనీయుల సేవలు స్మరించుకోవడానికి ఇది చక్కటి అవకాశం అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. జగ్జీవన్ రామ్ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా గొప్ప సేవలు అందించారన్నారు. విద్యా రంగంలో మంచి స్థానంలో ఉండాలని, దళితులు అందరితో సమానంగా ముందుండాలని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ మాట్లాడుతూ, 27 సంవత్సరాలచిన్న వయస్సు లోనే జగ్జీవన్ రామ్ ఎమ్మెల్యే అయ్యారని, 50 సంవత్సరాలకు పైగా పార్లమెంటేరియన్ గా కొనసాగారని, వారిని స్ఫూర్తి గా తీసుకోవాలని అన్నారు.

దళితుల సంక్షేమం కోసం గురుకులాలు, దళిత బంధు లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. జయంతి వేడుకల్లో కేక్ కోశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎస్సి గురుకులాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, అదనపు డిసిపి ఏఎస్ సి. బోస్, సోషల్ వెల్ఫెర్ డిడి కె. సత్యనారాయణ, కార్పొరేటర్ అమృత, డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గాజుల నర్సింహారావు, కో-కన్వీనర్లు జాగటి మధు, గుడిగొండ ఉప్పలమ్మ, జమల్లముడి దాస్ మహారాజ్, నారపోగు వెంకటేశ్వర్లు, అధికారులు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page