స్థానికేతరుడు వద్దు… స్థానికుడే ముద్దు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

స్థానికేతరుడు వద్దు… స్థానికుడే ముద్దు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 25 at 2.53.13 PM

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని “రావులపల్లి” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ MPTC అభ్యర్థి అరుణ్ కుమార్, నాదిరిగే కమాల్ రెడ్డి, మొగులయ్య, మహేందర్, రమాకాంత్ యాదవ్, శివకుమార్, శివరాం, వెంకటేష్ ప్రవీణ్ “తిమ్మాపూర్” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు నర్సిములు మాజీ వార్డు సభ్యులు బిచ్చయ్య, నాయకులు చిన్నయ్య, బాబు, మైసయ్య, వికారాబాద్ మండలం “మైలార్ దేవరంపల్లి” గ్రామానికి చెందిన BJP బూత్ కమిటీ అధ్యక్షులు రమేష్, సంతోష్, రాములు, మల్లేష్, శ్రీకాంత్ “మదన్ పల్లి” గ్రామానికి చెందిన కాంగ్రెస్, BJP నాయకులు రాములు, శేఖర్ హనుమంతు, జగన్, శ్రీకాంత్ వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని “కొత్తగడి” కి చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ రాములు నాయకులు విజయ్, శ్రీనివాస్ ఆలంపల్లి కి చెందిన మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ బన్సిలాల్ వారి అనుచరులు కాంగ్రెస్, BJP పార్టీల నుండి 150 మంది BRS పార్టీ లో చేరారు.

ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

▪️ వికారాబాద్ నుండి గతంలో స్థానికేతరులకు అవకాశం ఇచ్చి చాలా నష్టపోయామని, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే అభివృద్ధిని చేసుకోలేకపోయమని, కాబట్టి మన వికారాబాద్ ప్రాంతంలో మనమే పాలన చేసుకుందామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS