BRS పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న దాడి చూసి మీరు అస్సలు భయపడవద్దు..
రాహుల్ గాంధీని చూసి ధైర్యం తెచ్చుకోండి..
కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ కూడా ఇస్తాం
సోషల్ మీడియా వర్క్ షాప్‌లో కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దీపా దాస్ మున్షీ దిశానిర్దేశం
మీకు కంటెంట్ ఏం పెట్టాలి, కామెంట్స్ ఏం పెట్టాలి అన్ని గాంధీ భవన్ నుండి సూచనలు ఇస్తాం
నెలలో ఎక్కువ పోస్టులు పెట్టినవారికి పెద్ద ప్రైజ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది! ప్రతీ నెలా మేం సోషల్ మీడియాలో టాపర్ల పేర్లు ప్రకటిస్తాం.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వారికి స్మార్ట్ కార్డ్స్ ఇస్తాం..
నిజం చెప్పాలంటే మనం సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ కన్నా బలహీనంగా ఉన్నాం. మనం వాళ్ళలాగా కోట్ల రూపాయలు ఖర్చు చేయలేం అందుకే మనం బలహీనంగా ఉన్నాం.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ప్రతిపక్షం సోషల్ మీడియాలో మనల్ని విమర్శిస్తే మనం నిరాశలో కూరుకుపోతున్నాం. ఆ నిరాశ ఇక వదిలేయాలి.
ఈ వర్క్ షాప్ లో మీకు మనం బలోపేతం కావడానికి అవసరమైన వ్యూహం పార్టీ పెద్దలు ఇస్తారు.