పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా పూజలందుకుంటున్న పెద్దమ్మ తల్లి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించుకోవడం సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జి.రవి, మరేళ్ల శ్రీనివాస్, షౌకత్ అలీ మున్నా, అగ్రవాసు, పి.మహేష్, కె.నాగయ్య గౌడ్, సౌందర్య, వాలి నాగేశ్వరరావు, మహేష్, నాగేష్, మధూమ్, కృష్ణ, గోపిచారి, రాజు, బాలు, శ్రీను, తిరుపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.