కాటారం మండల ఇన్చార్జి ఎంఈఓ గా వింజపల్లి శ్రీదేవి
భూపాలపల్లి జిల్లా:
భూపాలపల్లి జిల్లా కాటారం మండల ఇంచార్జి ఎం ఈ ఓ గా వింజపల్లి శ్రీదేవి తాజాగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఎం ఈ ఓ గా బాధ్యతలు స్వీకరించి నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తానని అన్నారు.
విధి నిర్వహణలో భాగంగా నిత్యం ప్రభుత్వ పాఠశాల ను పర్యవేక్షిస్తానాని అన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బం ది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం ఆమె కాటారం మండలం దేవరాంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు..