దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి
సాక్షిత, తిరుపతి: దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి చేయాలని పౌర గ్రంథాలయ సంచాలకులు ఎం.ఆర్.ప్రసన్న కుమార్ సూచించారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. సందర్శనలో భాగంగా గ్రంధాలయములో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. గ్రంథాలయంలో అమర్చిన పుస్తకాలను పరిశీలించి, గ్రంథాలయ పరిసరాలు ఆవరణలంతా పరిశుభ్రంగా ఉన్నాయని ప్రశంసించారు. గ్రంథాలయం పైకప్పును దాతల సహాయంతో బాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పని తీరును చూసి సంతృప్తి చెందారు. గ్రంథాలయాధికారి వి.సూర్యనారాయణ మూర్తి (వి ఎస్ ఎస్ ఎన్ మూర్తి) వివరిస్తూ గ్రంథాలయములోని అన్ని విభాగాలు ప్రతి రోజు పరిశుభ్రంగా ఉంచుతున్నామని, పాఠకులకు కావలసిన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామని వివరించారు. ఇంకా దాతల సహాయంతో పది ఫైబర్ కుర్చీలను వితరణగా పొందడం జరిగినదని డైరెక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ I సునీల్ బాబు, ఎస్కే ఖయ్యూం అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, వి మనోజ్ బాబు కార్డు రైటర్, రాధమ్మ రికార్డు అసిస్టెంట్, భారతి లైబ్రేరియన్, ప్రతాప్ లైబ్రేరియన్, మనిగండన్ లైబ్రరీ హెల్పర్ పాల్గొన్నారు.
దాతల సాయంతో గ్రంథాలయాల అభివృద్ధి
Related Posts
ముందుచూపు, దూరదృష్టితో ప్రజలకోసం పనిచేసే నాయకుడు
SAKSHITHA NEWS ముందుచూపు, దూరదృష్టితో ప్రజలకోసం పనిచేసే నాయకుడు దొరకడం రాష్ట్రానికి వరం : మాజీ మంత్రి పుల్లారావు. నాదెండ్ల మండలం తూబాడు, సాతులూరు గ్రామాల్లో ప్రభుత్వం రూ. 10 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్లను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్…
మున్సిపల్ చైర్మన్, కమిషనర్ల కార్యాలయాల మార్పుపై ప్రజల అసంతృప్తి
SAKSHITHA NEWS మున్సిపల్ చైర్మన్, కమిషనర్ల కార్యాలయాల మార్పుపై ప్రజల అసంతృప్తి కార్యాలయాల మార్పుతో దివ్యాంగులు, వృద్దులకు ఇబ్బందులు కార్యాలయాలు గతంలో మాదిరి యధావిధిగా కొనసాగించాలంటున్న ప్రజలు చిలకలూరిపేట: రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు చేరువగా ఉండి, వారి…