శంకర్‌పల్లి: క్రిస్టల్ వెంచర్ కాలనీలో కుక్కలు బాబోయ్
సాక్షిత శంకరపల్లి : శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి క్రిస్టల్ వెంచర్ కాలనీలో కుక్కలు యథేచ్ఛగా స్వైర్యవిహారం చేస్తున్నాయి. పట్టణంలో ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతున్న వాటి సంతతిని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పట్టణంలో చికెన్, మటన్
సెంటర్లు, హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కళంగా ఆహారం
దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది.
దాదాపు గొర్రెల మందల్లా అవి
పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లలో కనిపిస్తున్నాయి. సాధారణంగా మను షులు చూస్తే దూరంగా పారిపోయే
పరిస్థితి పోయి మనుషుల పైకి, వాహనాలపైకి అవి ఎగబడుతున్నాయి. దీంతో అటు పాదాచారులు, ఇటు
ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో పిల్లల్ని ఒంటరిగా పంపాలంటే
భయంగా ఉంటోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని, కుక్కల సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.